Friday, February 21, 2014

మనము మన దేవతలు
సైన్సూ దాని పరిమితులు


మనం భారత దేశంలో పుట్టినందుకు ఇక్కడి చరిత్ర , దేవతల గురించి మనకు క్షుణ్ణంగా తెలిసి ఉండాలి . తెలియక పొతే ఏమ్పోతుంది అంటే మనకూ ఇక్కడ పెరిగే జంతువులకు ఏమి తేడా ఉండదు .


ప్రతి దేశానికీ ఒక చరిత్ర ఉంటుంది . చరిత్ర లోనుంచే ఆచారాలు అలవాట్లు పుడతాయి . చరిత్రలో ఉన్న మహాపురుషులనే మనం ఆదర్శంగా తీసుకుంటాము . వారు చేసిన పనుల గొప్పతనాన్ని బట్టి వాళ్ళను కొన్ని వేల , లక్షల సంవత్సరాలు గడిచినా కూడా తలుచుకొంటాము . కొంత మంది కయితే గుడులు కట్టి దేవతలు గా కుడా ఆరాధిస్తుంటాము . దేవత / దేముడు అంటే ఇచ్చేవాడు అని అర్థం తీసుకోవచ్చు .  ఎందు కంటే , గుడి కి వెళ్లి , నాకు అది కావాలి, ఇది కావాలి, ఇవ్వు (దేవ్) అని అడగటానికే చాల మంది వెళుతున్నారు ఈకాలంలో . మనం అడిగినవి ఇస్తున్నాడు కాబట్టి దేముడు అంటున్నాము .


ఏమి అడిగినా ఇచ్చే వాడిని  “మహా దేవుడు “ అనీ కొన్ని మాత్రమె ఇచ్చె వాడిని , ఆ ఇచ్చే వస్తువు పేరుతొ , గాలి ఇచ్చే వాడిని గాలి దేవుడనీ , వర్షం ఇచ్చే వాడిని వరున దేవుడనీ , వేడి ని ఇచ్చే వాడిని అగ్ని దేవుడనీ చదువు ఇచ్చే ఆవిడని సరస్వతి దేవి అని, లోకమంతా వ్యాపించి ఉన్న వాడిని విష్ణు దేవుడనీ , సృష్టి చేసేవాడిని బ్రహ్మ దేవుడనీ , ఇలా ప్రతి పనికీ, ఒక అధిష్టాన దేవత ని మన పూర్వికులు గుర్తించి ఆ అవసరం ఉన్నప్పుడు వారిని అడిగి (దేవ్ దేవ్ ..అంటే ఇవ్వు ఇవ్వు అని) వారికీ కావలసిన కార్యాలు సిద్ధింప చెసుకొనె వారు .
చెట్టు , కొండ , నదీ , భూమి ఇవన్నీ  కూడా మనకు , జీవితానికి కావలసినవి ఇచ్చేవే అందుకే వాటిని కూడా  దేవతలు గానే భావించి గౌరవిస్తాం .   గౌరవించడ మంటే  వాటిని పాడు చేయకుండా మన పిల్లల తరాలకు అందచేయడమే ! (అర్థం కాని వారికోసం .. చెట్లు మనం పుట్టినప్పటి ఊయల నుంచి, పెద్దయాక మంచం గాను, ఆకలేస్తే తినటానికి పండ్లు ఇచ్చి, పోయ్యి  లోకి కట్టె లిచ్చి , చస్తే కాల్చటానికి కూడా కట్టేలిస్తుంది .  కొండలు  పర్వతాలు, మనకు నదులనిస్తాయి, ఇల్లుకట్టుకోడానికి రాళ్ళని , నదులు తాగడానికి నీళ్ళనీ ఇస్తాయి . భూమి మనకు తినే సమస్తాన్ని ఇస్తున్ది.  మరి ఇచ్చె వాటిని దేముడు దేవత అంటే తప్పేంటి ? )


కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఈ అలవాటు, మన సంస్కృతి గా మారి , మన దేశాన్ని సస్యస్యామలం గా ఉంచింది . అడవులని, వనాలని మనం వన దెవతగా పూజిస్తాం కాబట్టి వనసంపదను ఎవరూ నాశనం చేసే వారు కాదు.   ఒక చెట్టును నరకాలన్నా దానికి ఒక పద్ద్హతి ఉండేది .  ఒక రోజు ముందుగా దానికి చెప్పాలి .  దాన్ని ఆశ్రయించి ఉన్న పక్షులు ఇతర జీవాలను అక్కడినుంచి పంపించాలి .  చెట్టుకు నువ్వులు, నీరు (తిలోదకాలు ) ఇవ్వాలి .. అంటే ఆ చెట్టులో ఉన్న జీవాన్ని కూడా వదిలి వెళ్ళమని చెప్పాలి.  అంటే మన దేశమంత , మన సనాతన ధర్మ మంత , పర్యావరణ పరిరక్షణ ఇంకో దేశం చెయ్యదన్నమాట .


మన సంస్కృతి యొక్క గొప్పతనం గ్రహించలేని అన్య మతస్తులు , మనం చెట్లకు గుట్టలకు మొక్కడం చూసి మనలని ఎగతాళి చెస్తారు. మొక్కడం అంటే గౌరవించడమే , నాశనం చెయ్యకుండా, తర్వాతి తరాలవాల్ల కు అప్పగించడం . అవన్నీ ఎందుకు చేస్తున్నామో మనకే తెలియక పొతే , బయటి మతస్తులు చెప్పేది నిజామేనేమో అనిపించి మనం చేసే మంచి పనులు కూడా మనే స్తాము .
మానేస్తే , మన సంస్కృతి ఉండదు , మన అడవులు ఉండవు , మన దేవుళ్ళు ఉండరు , గుడులు ఉండవు , చివరికి మన దేశమే పరాయి పాలనా లోకి వెలుతుంది ..


ప్రతి దేశ చరిత్ర , ఆ దేశ పురాణం రూపంలో ఉంటుంది . మనకు 18 పురాణాలు ఉన్నాయి ఎందుకంటే  మనం ఇక్కడ కొన్ని కోట్ల సంవత్సరాలనుంచి  ఉన్నాము.  2 నుంచి 5 వేల సంవత్సరాల చరిత్ర మాత్రమె ఉన్న దేశాలకు కేవలం ఒక్కొక్క పురాణం మాత్రమే ఉన్నాయి . ఉదాహరణకు ఇస్రేలు పురాణం, అరబ్ పురాణం మొదలగునవి . మన పురాణాల్లో ఎక్కడా, ఏ దేముడూ కూడా వేరే దేవతలను పూజించవద్దు అని చెప్పడు .  ఎందుకంటే , ఏపేరు తో పిలిచినా పలికేది  ఆ పరమాత్ముడే ! పరమాత్ముడు ఎవరిని ద్వేషించాలి ? అందరిలో ఉన్నది అతనే మరి. అన్నీ తానైనవాడికి వేరుగా ఇంకొకరు ఉండరు .  అంతా  తను కాని దేముడే, వేరే దేముళ్ళని కొలవకండి అని చెప్పాల్సివస్తుంది ! అదే అనంతమైన వానికి పరిమితి అయిన వానికీ ఉన్నా తేడా .  అనంతమైన దైవం లోనే అందరు ఉంటారు .  అనంతమైనది  మన  దైవం - మిగతావన్నీ పరిమితమైనవే  !
క్రింద గ్రీకు అక్షర మాల చూడండి .



మనం పరమాత్మ ని , ఆది-మధ్య-అంత రహితునిగా అంటే , మొదలు లేక పుట్టుక , మధ్య జీవితం, అంతం లేక చావు ఇవేవీ లేని వాడు గా  వర్ణిస్తాం  .
అన్య దేశ  పురాణాలలో దేవుడు “ఆల్ఫా to ఒమేగా “ అంటారు . ఆల్ఫా అనేది గ్రీకు లో మొదటి అక్షరం, ఒమేగా చివరి అక్షరం . అంటే వారి దేముడు మొదటి నుంచి చివర వరకు మాత్రమే ఉంటాడు అన్నమాట . ఏ మొదలు ఏ  చివర ? “సృష్టి మొదలు నుంచి సృష్టి అంతం వరకు “ .  ఇక్కడ పుట్టి , అన్య పురాణాలు చదివే వారు , కొంతమంది వారి దేముడి ని కూడా అది-మధ్య-అంత  రహితుదని చెప్పడం మొదలు పెట్టారు . మన వాళ్ళను confuse (తికమక ) చెయ్యడానికి .  


సృష్టి అనేక సార్లు జరుగుతుంది అని, కల్పాతం లో పుట్టినవి అన్నీ పోతాయని , ఈ భూమి, సూర్య చంద్రులు కూడా పోతాయని మన పురాణాలలో చెపుతారు .,


కాలానికి అతీతంగా ఉన్న పరమాత్మనే మనం కొలుస్తాము . కాలంతో పాటు పోయే వాళ్ళను కాదు.
నిన్న , నేడు, రేపు ఎప్పటికీ ఒకే రకం గా ఉన్న దెవుల్లనె మనం కొలుస్తాం .


మనుషులకు పుట్టిన వాళ్ళను మనం ముఖ్య దేవతలుగా కొలవము.  మన త్రిమూర్తులు ఏ  తల్లికీ పుట్టలేదు
ఈ విషయాన్ని సృష్టి గురించి తెలుసుకొనే సమయం లో చెప్పుకొందాం .


విగ్రహాలలో దైవం ఉంటుందా  ?


“చిల్లర రాళ్ళకు మొక్కుతు ఉంటె చెదిపొదువురా ఒరే ఒరే … “ అని ఎవరో (భక్తిహీనులు ?) పాట వ్రాశారు . అదే విషయాన్ని , విదేశీ  పురాణాలు వారం వారం చదివే అన్యులు అప్పుడప్పుడూ  మనలను దెప్పుతూ(అపహాస్యం చేస్తూ ) ఉంటారు . కొత్తగా విదేశి పురాణాన్ని చదవడం మొదలు పెట్టినవారు , వారి ఇంటిలో ఉన్న విగ్రహాలను , పటాలను, బయట పడేస్తుంటారు, లేక ఏ  గుడి దగ్గరో , చెట్టుకిందో వదిలి వెళుతుంటారు .  ఒక చిన్న గుడి దగ్గర , అనేక మైన మంచి పటాలను ఈమధ్యనే చూసాను . అలాంటివి కొన్ని చిన్నప్పుడు మా పూజ గదిలో ఉండేవి . ఇంత  మంచి విగ్రహాలను, పటాలను ఇలా గాలికి , వానకు ఎవరు వదిలేసి ఉంటారు చెప్మా ! అని సందేహం కలిగింది . దానికి సమాధానం విదేశి పురాణాల జోరు అని అర్ధం అయింది .


పాత కాలం లో శ్రుతి /వేదం విన్న మాటే  ప్రమాణం గా ఉండేది . మరి ఇప్పుడు కలి  యుగం లో చదువు వచ్చిన వాడికి రాని  వాడికి కూడా, అచ్చు వేయబడినదే (వ్రాత కోతలే) ప్రమాణంగా మారింది . printed మేటరే   ప్రమాణం ! అది స్వదేశీ దా  విదేశీదా  అనేది కాదు .. ఏది ముందుగా లభ్యమైతే అదే జీవితాంతం ప్రమాణం గా మారుతున్నది !


అందుకే మన పిల్లల  ఖాళీ బుర్రలలొ ఏ  విదేశీ  విత్తనాలో  మొలిచే లోగా , మన సనాతన విత్తనాలనే మోలిపించుకొంటే , మన దేశ  పరిస్థితులకు అనుగుణంగా అవి పెరుగుతాయి . మన నదులూ , కొండలూ , పుణ్యక్షేత్రాల గురించి మనం ముందు గా , క్షున్నం గా తెలుసుకొంటే , మన దేశాన్ని , సంస్కృతినీ మనం కాపాడుకో గలుగుతాం .


విగ్రహాలలో దేముడున్నాడా అనే అంశానికి వస్తే ,
మనం ఏ  విగ్రహాన్ని గుడిలో ప్రతిష్టించి నా , ముందుగా దానికి ప్రాణ ప్రతిష్ట లేక ఆవాహణ చే స్తాము. ఆ విగ్రహ మాధ్యమంగా (medium ) మనం ఆ దేవతా శక్తి తో మాట్లాడతాం , కోరికలు కోరతాం , ఆశీస్సులు తీసుకొంటాం . కోరికలు తీర్చబడితే  మళ్లీ  మళ్లీ , అదే గుడికి వెళతాం .


మరి విగ్రహం ఏ  విదేశీయు డో  విరగగొడితే ! మన దేముడు చచ్చి పోతాడా ? తనని తాను రక్షించుకోలేని దెముల్లనా మీరు కొలిచేది ? అని అన్యుడు అంటే ఏమి చెపుతారు ?
సెల్ ఫోన్ / టెలీ  ఫోన్ మాధ్యమంగా ఎక్కడో ఉన్న స్నేహితునితో మాట్లాడతాం . ఎవరైనా ఆ ఫోన్ విరగగొడితే మన స్నేహితుడు మరణిస్తాడా ? లేదే !  ఫోన్ విరుగుతుంది .అంతే  కానీ  , ఎవరైతే మనం అడిగినవన్నీ కొరియర్ లో పంపిస్తాడో ఆ స్నేహితునికి ఏమి కాదు.  అలాగే , మన గుడి లోని విగ్రహాన్ని ఎవరైనా విరగ్గొట్టినా దేముడిని విరగ్గోట్టలేరు .
ఇంకొక విషయం . మనదేవతలు  శక్తి స్వరూపాలు . వారు ఎప్పుడూ  చావరు . చెడ్డవాళ్లను మాత్రం చంపుతారు .  హర హర మహా దేవ !


ఒకప్పుడు ఇలాగె విష్ణువు ఎక్కడ ఉన్నాడు ?  ఈ స్థంభం లో ఉన్నాడా ? అని అడిగితే , ప్రహ్లాదు అనే భక్తుడు  ఇలా చెప్పాడు
“ ఇందు గలడు - అందు లేడు  
అని , సందేహము వలదు .
చక్రి - సర్వోపగతుండు
ఎందెందు వెదకి చూసిన - అందందే గలడు  దానవాగ్రజా !”
అని తనని చంప దలచిన  తండ్రి తో కూడా ఎంతో  వినయంగా చెప్పాడు . అదీ  మన సంస్కృతి .
తర్వాత ఆ స్తంభాన్ని , హిరణ్యకశిపుడు , మదం తో , గర్వం తో విరగకొట్టితే , అందు లోనుంచి సగం మనిషి సగం సింహం రూపం లో నరసింహుడు గా విష్ణువు (అంతటా వ్యాపించి ఉన్నవాడు) వచ్చి రాక్షసుడిని చంపి వేస్త్తాడు . చెడు ను చీల్చి చంపే నరసింహుడి అవతారాన్నే మనం, యాదగిరి, సింహాచలం, హంపి,  అహోబిలం మొదలగు క్షేత్రాలలో చూస్తాము .
విష్ణువు అనే పదానికి అర్థమే వ్యాపించి ఉన్న వాడని అర్థం . ఎవరైనా అంతటా ఎలా వ్యాపించి ఉంటాడని అనుమానం కలిగిందా ?  ఎలక్ట్రాన్ లేని పదార్థం ఏమైనా ఉన్నదా ?  ఎలెక్ట్రాన్ అనీచొట్ల  ఉన్నది .  మన శరీరం అంతటా, తినే ఆహారం లో, చదివే కాగితంలో, వ్రాసే పెన్ లో, ఇంకు లో , గోడ లో, చెట్టు లో పుట్టలో కరెంట్ ప్లగ్ లో, మెరిసే మేఘం లో, మెరుపులో ..  ఎలేక్ట్రోన్ శక్తి కూడా మనకు తెలుసు. అంతటా ఉన్నవాడినే మనం విష్ణువు అన్తాము. ఎలెక్ట్రాన్ కదలికే కరెంట్ . కరెంట్ షాకు కొడుతుంది . మెరుపు కూడా షాక్ కొడుతుంది . పాపం హిరణ్యకశిపునికి స్థంభం నుంచి వచ్చిన నరసింహుడు షాక్ ఇచ్చాడు . వాడు చచ్చాడు!


విగ్రహం లో దైవం  ఉంటుందా (దేవత లేక దేముడు) అన్నదానికి   పెద్దలు ఇలా చెప్పారు  
“ఏ  విధంగా అయితే
                     గింజ లో చెట్టు  ఉంటుందో,
                      పువ్వు లో వాసన ఉంటుందో
                              నువ్వుగింజ లో నూనె ఉంటుందో ,
                                    అలాగే  మూర్తి లో దైవం  ఉంటుంది  ,
                        


విగ్రహంలో ఉన్న శక్తి ని పరీక్ష చేసే యంత్రాలు సైన్స్ ఇంకా కనుక్కోలేదు . మనిషి లో ఉన్న ప్రాణం సంగతే సైన్స్ సరిగా చెప్పలెదు. కోపాన్ని , ద్వేషాన్ని కొలిచే సాధనాలు ఉన్నాయా ?సైన్స్ కి అంతుచిక్కని విషయాలు ఎన్నో ఉన్నాయి .  అలాంటివి మన సంస్కృతి  లో చాలా  ఉన్నాయి . సైన్స్ నిరూపించ లేనివన్నీ అబద్దాలు కవు. సైంటిఫిక్ జ్ఞానం చాలా పరిమితమైనది . సనాతన ధర్మం అపారమైనది .


ఇతర పురాణాలు “చూడక నమ్మిన వారు ధన్యులు  “ అంటాయి
మనం మన సంస్కృతిలో దేనినైన ప్రశ్నిం చవచ్చు
 ఏ దేవతా మూర్తి నైనా కొలిచే స్వతంత్రం మనకు ఉంది . వేరే వారికి  లెదు.
                    పుట్టని, చావనీ , సదాకాలం ఉండే దేవతలనే మనం కొలుస్తాం .


మన ఆచారాలని మనం వదలి పెట్టకూడదు .
     ఆచారః పరమో ధర్మ, ఆచారః పరమం ధనం ।
                                        ఆచారః పరమా విద్యా ఆచారః పరమా గతిహి ॥
   ఆచారహీనః పురుషో లోకే భవతి నిన్దితః ।
                                       పరత్ర  చ సుఖి న స్యాత్తస్మాదాచారవాన్ భవేత్ ॥  



సృష్టి గురించి మన పురాణాలు, స్మృతులు  ఏమి చెపుతున్నయో ఆది దైవం నుంచి మనం ఎలా వచ్చామో  తెలుసుకొందాం …. to be  continued